Valuable Information
::Free Online Pooja's: విదేశాలలో ఉండే మన తెలుగువారికోసము అన్నిరకాల పూజలు (వ్రతములు, నోములు, వాహన పూజలు, వ్యాపార సంస్థలలో శుక్రవారము పూజలు, online (skype) ద్వారా ఉచితముగా నిర్వహించబడును. మీరు సంప్రదించ వలసిన మా ఈమెయిలు venkat@sakalapoojalu.com, rmsharma@sakalapoojalu.com                                                                                         గోదావరినది చరిత్ర


              గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవు. భద్రాచలము, రాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని. ధవళేశ్వరం దగ్గర  అఖండగోదావరి(గౌతమి) ఏడుపాయలుగచీలుతుంది.అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప.ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలుమాత్రమే ప్రవహించేనదులు. మిగిలినవి అంతర్వాహిని(conceal)లు. ఆపాయలు  సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

      పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడం తో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.

           ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

 
గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నది.

ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:


వైన్‌గంగాపెన్ గంగ, వార్ధా నది, మంజీరా నది, ఇంద్రావతి నది, బిందుసార, శబరి నది, ప్రవర, ఫూర్ణా, ప్రాణహిత, సీలేరు నది, కిన్నెరసాని, మానేరు

గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు:

 త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, మంథని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, పట్టిసం (పట్టిసీమ), కొవ్వూరు, రాజమండ్రి, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది, అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ వారి దేవస్థానం. మురమళ్ళ ,శ్రీ వీరేశ్వరస్వామి

గోదావరి ప్రాంతపు కవులు : తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు. అల్లమరాజు రామకృష్ణకవి, అల్లమరాజు వేంకటకవి, అవసరాల పద్మరాజు, అనివిళ్ళ వేంకటశాస్త్రి, ఈదులపల్లి భవాని శంకరకవి, ఎర్రమిల్లి సూర్యప్రకాశ కవి, ఏనుగు లక్ష్మణకవి, ఏనుగు లత్సకవి, ఓగిరాల జగన్నాథ కవి, ఓగిరాల రంగనాథ కవి, కూచిమంచి జగ్గకవి, కూచిమంచి తిమ్మకవి, కూచిమంచి వేంకటరాయుడు, కొడిచెర్ల శ్రీనివాసకవి, కొత్తలంక మృత్యుంజయకవి, చెళ్ళపిళ్ళ నరసకవి, జగన్నాథ పండితరాయలు, తామరపల్లి తిమ్మయ్య, దామరాజు లక్ష్మీనారాయణ, దిట్టకవి వేంకటామాత్యుడు, నడిమింటి సర్వమంగళేశ్వరశాస్త్రి, నింబార్కుడు, నిట్టల ప్రకాశాదాసు, నూతనకవి సూరన్న, పట్టమట్ట సరస్వతీ సోమయాజి, పిండిప్రోలు లక్ష్మణ కవి, భాస్కరాచార్యులు, మల్లికార్జున పండితుడు, మిక్కిలి మల్లికార్జున కవి, ములపాక బుచ్చన్న శాస్త్రి, యథావాక్కుల అన్నమయ్య, రేకపల్లి సోమనాథకవి వంకాయలపాటి వేంకటకవి నారాయణతీర్థులు చిర్రావూరి కామేశ్వరరావు.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Poojas information

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

 

 

Bhakthi Gallery

Testimonials

We will be updating your search
Visit again.

© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb