Valuable Information

home inner page

🌷కొన్ని పరిహారాలు🌷
 
1.ఆస్తి తగాదాలు తో ప్రాణహాని, తరచూ గండాలు ప్రాణభయం ఉన్నవారి , విడిపోయే పరిస్థితి లో ఉన్న కుటుంబ సభ్యులు,మంగళవారం అమ్మవారి గుడిలో రహుకాలం సమయం (3- 4.30) లో గుడిలో కానీ ప్రాంగణంలో కానీ చిన్న గుమ్మడికాయ కోసి అందులో గుజ్జు గింజలు తీసి అందు లో నైయ్యి,లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి 6, 9, 12,  వారాలు, సమస్య తీవ్రత బట్టి మీరు అనుకోవాలి అలా చేసాక అక్కడ ఏదైనా తీపి పదార్ధాన్ని ఒక ఆకులో కానీ పేపర్ ప్లేట్ లో కానీ పెట్టి రావాలి లేదా కుక్కకి ఏదైనా తీపి పెట్టి వస్తే మంచిది.. ఇది గుడిలోనే చేయాలి.. మీ కోరిక చెప్పుకుని చేయాలి..
 
2. అలాగే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడరు వారి గురువారం రోజు ఉదయం కొబ్బరికాయ రెండుగా పగలగొట్టి(ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు) అందులో కొద్దిగా నైయి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా వీరు కూడా 9 గురువారాలు చేసి ప్రతి గురువారం రోజు అవుకి ఏదైనా తినిపించాలి..
 
3.ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చైదాటి పోతుంది అటువంటి స్త్రీ / పురుషులు  అమ్మవారి గుడిలో శుక్రవారం రోజు బెల్లం ముద్ద పైన నైయ్యి లో తడిపిన ఒత్తిని ఉంచి దీపారాధన చేయాలి నిమ్మపండు నైవేద్యంగా పెట్టాలి అలాగే నిమ్మపండు దీపం కూడా పెట్టాలి.. తాంబులం లో బ్రాహ్మణులకు తోచిన దక్షణ పండ్లు సమర్పించి ఆశీర్వాదం తీసుకుని రావాలి  ఇలా 11 శుక్రవారాలు చేస్తే మంచి సంబంధం కుదురుతుంది..
 
4.అలాగే వివాహం కోసం ఇంకో పరిహారం ప్రతి మంగళవారం ఇంట్లో కుల దేవత లేక ఇలవెలుపు  ముందు బియ్యం పిండితో దీపం పెట్టి పానకం  నైవేద్యం పెట్టి ఆ దేవుని యొక్క స్త్రోత్రం చదివి హారతి ఇవ్వాలి..ఆ రోజు మాంసాహారం, గుడ్లు తినకూడదు.
 
5. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లు, ఏదైనా కోర్ట్ తగాదాలు ఉన్న వారు, ప్రత్యంగిరా, నరసింహ, భైరవుడు, దక్షణామూర్తి, వేంకటేశ్వరస్వామి వీరిలో ఏ మూర్తిని విశేషంగా ఉపాసించిన ఆ సమస్య కు పరిస్కారం లభిస్తుంది.
 
6.పిల్లలు తల్లిదండ్రుల మధ్య సక్యతకు దక్షణామూర్తి ని వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. 
 
7.కుటుంబం లో ధనం నిలవాలి అన్నా సంతోష గా ఉండాలి అన్నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అన్నా శ్రావణ నక్షత్రం పూజ నెలలో ఒక్కసారి కచ్చితంగా చేసుకోవాలి..
 
8.విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారు అది మనసులో తలుచుకుని పారె నదిలో బొగ్గుని వదలాలి, అలాగే ఏపుగా పెరిగిన గడ్డి ని మీ కోరిక చెప్పుకుని మూడు సార్లు గడ్డి తెగకుండా ముడి వేయాలి , అలాగే చీమలు ఉన్న చోట ఆహారం వేయాలి. ఇవి తంత్రం అంటారు.
 
9.శని దశ నడిచే సమయంలో రోజు కాసేపు వాకింగ్ చేయాలి కాళ్లకు శ్రమ కలగాలి, అలాగే పారె నదిలో గాని చెరువులో గాని ఇనుము చీలలు (మేకులు) వదలాలి, అలాగే సముద్ర స్నానం చేయాలి చాలా ఉపశమనం లభించి ఆయన ప్రభావం తీవ్రత తగ్గుతుంది..
 
10. లలితా సహస్ర నామ వివరణలో అన్ని సమస్యలకు పరిహారం రాస్తున్నాను వీటితో పాటు ఆ నామ మంత్రాన్ని ఎంచుకుని రోజూ 108 సార్లు జపం చేస్తే ఇంకా త్వరగా పరిస్కారం లభిస్తుంది.
 
11. శత్రుబాధలు నివారణ కోసం, పంచాయుధా స్త్రోత్రం, హనుమాన్ బడబాణల స్త్రోత్రం, ప్రత్యంగిరా స్త్రోత్రం మంచి పరిస్కారం లభిస్తుంది, అలాగే శత్రువులని శిక్షించడం కోసం భగలాముఖీ, వారాహి, కాళీ  శత్రు సంహారం స్త్రోత్రలు చేయవచ్చు..
 
12. ప్రదోషంలో చేసి శివాభిషేకం వల్ల చెడు ప్రయోగాలు నుండి విముక్తి, ఇన్ఫెక్షన్ లాంటి బాధలు తొలగి పోతుంది...
 
👉యాత్రలు కు వెళ్లే టప్పుడు ఇంట్లో దేవుడు పస్తు ఉంటాడా ఈ విషయం గురించి ఇంకో టపాలో తెలుసుకుందాము...ఇంకా కొన్ని పరిహారాలుకూడా తర్వాత చెప్పుకుందాము..
 
🌷శ్రీ మాత్రే నమః🌷
పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb