సంవత్సరంలోని పదవమాసం పుష్యము. సూర్యుడు ' భగ ' అను పేరుతొ రథముపై సంచరించి ప్రపంకామునకు వేలుగునిస్తాడు. ఆ రథములో అరిష్టనేమి అను గంధర్వువుడు, పుర్వచిట్ట అను అప్సరస, ఊర్నుడు అను యక్షుడు, కర్కోటకుడు అను పాము, ఆయువు అను ఋషి, స్ఫూర్ణ అను రాక్షసుడు ప్రయాణిస్తారు. తిథి, వార, మాస, సంవత్సర, ఆయనములు, ఘటికలు మొదలగు కాలముయోక్క భాగములు భగాదిత్యుడి అధిపతి పదకొండు వేల కిరణముల ప్రకాశాములతో ఉండును. ఎర్రని రంగు కిరణములో ఉంటుంది. ప్రక్రుతి అంతటా ఐశ్వర్య రూపముతో పుస్యమాసమంతా తిరుగుతాడు. సూర్యుడు, శివుడు, చంద్రుడు, సౌభాగ్యము, ప్రసన్నత, కీర్తి, అందము, ప్రేమ , మంచిగుణములు, ధర్మములు, ప్రయత్నములు, మోక్షము, శక్తి అన్నీ భాగాదిత్యుని రూపాలే. ప్రకృతియందు దివ్యశోభ నింపుతాడు. పుష్యమాసంలో సూర్యున్ని ఉపాసించే వారికి సంపదలు, మోక్షము ఇస్తాడు. అసలు భాగము అంటేనే ఐశ్వర్యము, ధర్మమూ, జ్ఞానము, వైరాగ్యము. ఈ ఆరు లస్ఖనాలను భగము అంటారు. పుష్యమాసమున భగాదిత్య స్వామికి బియ్యము, నువ్వులు కలిపి పొంగలి చేసి నివేదించాలి. నారించ రసముతో అర్గ్యము ఇవ్వాలి. ఆరోగ్యము, ఆనందము ఇస్తాడు.