భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.
ఆ మర్నాటి షష్ఠిని సూర్యషష్ఠిగా వ్యవహరిస్తారు. ఆరోజున సూర్యుని ఆరాధిస్తే మంచిదని నమ్మిక. అష్టమినాడు కొన్ని ప్రాంతాల స్త్రీలు కేదారవ్రతం చేస్తారు. ఇక దశమినాడు విష్ణుభక్తులు దశావతార వ్రతం ఆచరిస్తారు. నారాయణుడు వామనుడిగా అవతరించిన దినం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆరోజున శ్రవణా నక్షత్రం కూడా వస్తే మరింత ప్రశస్తం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈరోజున పాలకడలిపై మహాలక్ష్మీసమేతుడై శేష తల్పశాయిగా కొలువైన శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలిగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సప్తర్షి రామాయణము - SAPTARSHI RAMAYANAM.
కశ్యపః
జాతః శ్రీ రఘునాయకొ దశరథాన్మున్యాశ్రయాత్ తాటకాం
హత్వా రక్షిత కౌశిక క్రుతువరః కృత్వాప్యహల్యాం సుభామ్
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహిత్వా తతొ
జిత్వార్ధా ధ్వని భార్గవం పునరగాత్ సీతా సమేతః పురీమ్ - 1
అత్రిః
దస్యా మంధరయా దయారహితయా దుర్భొధితా కైకయీ
శ్రీరామ ప్రధమాభిషేక సమయే మాతా ప్యయాచద్వరౌ
భర్తారం "భరతః ప్రశాస్తు ధరణీం" "రామోవనం గచ్ఛతా"
దిత్యాకర్ణ్య సచొత్తరం నహి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః - 2
భరద్వాజః
శ్రీరామః పితృ శాసనా ద్వనమగాత్ సౌమిత్రి సీతాన్వితో
గంగాం ప్రాప్య జతాం నిదధ్య సగుహః సచ్చిత్రకూటేవసన్
కృత్వా తత్ర పితృ క్రియాం సభరతో దత్త్వా2భయం దండకే
ప్రాపా గస్త్య మునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయమ్ - 3
విశ్వామిత్రః
గత్వా పంచవటీ మగస్త్య వచనాద్ దత్త్వా2భయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్య కర్ణ యుగళం త్రాతుం సమస్తాన్ మునీన్
హత్వా తం చ ఖరం సువర్ణ హరిణం భిత్వా తథా వాలినం
తారారత్న మవైరి రాజ్యమకరోత్ సర్వంచ సుగ్రీవసాత్ - 4
గౌతమః
దూతో దాశరథీస్సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృస్ట్వా2శోకవనే స్థితాం జనకాజాం దత్వాంగుళేర్ముద్రికాం
అక్షాదీనసురాన్ నిహత్య మహతీం లంకాచ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య "దేవ! జననీ దృష్టామ" యేత్యబ్రవీత్ - 5
జమదగ్నిః
రామో బద్ధ పయో నిధిః కపివరై ర్వీరై ర్నలాద్యై ర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్న తనుజం హత్వా రణే రావణం
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా
రూఢస్సన్ పురమాగతః సభరతః సింహాసానస్థౌ బభౌ - 6
వసిష్టః
శ్రీరామో హయమేధ ముఖ్యమఖకృత్ సమ్యక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్య మధానుజైశ్చ సుచిరం భూరిస్వధర్మాన్వితౌ
పుత్త్రౌ భ్రాతృ సుతాన్వితౌ కుసలవౌ సంస్థాప్య భూమండలే
సో2యోధ్యాపురవాసిభిశ్చ సరయూ స్నాతః ప్రపేదేదివమ్ - 7
ఫలశ్రుతిః
శ్రీరామస్య కధా సుధా తి మధురాన్ శ్లొకా నిమాన్ యే జనాః
శృణ్వంతి ప్రపఠంతి చ ప్రతిదినం తే2ఘౌమ విధ్వంసినః
శ్రీమంతొ బహుపుత్త్ర పౌత్త్ర సహితా భుక్త్వేహ భోగాం శ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణై ర్విష్ణో ర్లభంతే పదమ్