యుగాది–– 2009
అనంతమైన, అద్భుతమైన, మహోన్నతమైన సకల చరాచర సృష్టికీ ఆది యుగాది. నిఖిలజగత్తులోని ప్రతి ప్రాణి జీవనంలో మార్పును తీసుకవస్తూ జీవన ఒరవడిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఆహ్లాదాన్ని పంచే పండుగ ఇది. బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించే సమయాన్ని సృష్టి ఆదిగా లెక్కిస్తున్నాం. ఆయన సృష్టికి శ్రీకారం చుట్టిన యేడాది మొదటి మాసం, తోలిరోజును ఉగాది పర్వంగా జరుపుకుంటున్నాం.
|
|
ఉగాది పచ్చడి
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం , ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. |
|
ఉగాది ప్రసాదం ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది. |