Valuable Information

ఆశ్వీయుజ-కృష్ణ-ద్వాదశి---గోవత్స-ద్వాదశి

ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశి ------      గోవత్స ద్వాదశి  

      

ఆశ్వీయుజ బహుళ ద్వాదశి.  ఈ రోజున దూడతో కూడిన గోవును పూజించాలి.  ప్రదోష కాలంలో నున్న ద్వాదశీ రోజున చేయాలి.  ఈ రోజున వత్స (దూడ) తో కూడి వున్న గోవును పూజించాలి.  రాగి పాత్రతో దాని పాదమందు అర్ఘ్యము ఇవ్వాలి.  
       క్షీర సాగర మదనంలో కామధేనువై జన్మించి దేవాసురులచే పూజించ బడినట్టి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతా  నీకు నమస్కారము.  ఈ అర్ఘ్యం గ్రహించు అని అర్ధం.

         ఋగ్వేదంలో "ఋక్కులు" పశువుల యొక్క ప్రాముఖ్యతను వివరించాయి.  ఋగ్వేద  కాలమునాటి ఆర్యులు పశు సంపద మీద ఎక్కువగా ఆధార పడ్డారు కాబట్టి ఆవుకు అతి పవిత్రమైన స్థానమిచ్చి చాలా ప్రాముఖ్యతను ఆపాదించారు.  ఈ కాలంలో పశువులను "గోధనముగా"భావించడమే కాకుండా, ఎవరికి ఎక్కువ పశు సంపద వుంటుందో, వారిని "గోమతులు" అని పిలిచేవారు.  

           ఈ రోజున తైల పక్వము, స్థాలీ పక్వము గోసంభందమైన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు అన్నింటిని విడిచి పెట్టాలి.  రాత్రి పూత మినుముతో చేసిన ఆహారాన్ని తిని భూమి మీదనే విశ్రమించాలి.  ఇలా ఐదు రోజులు ఈ విధిని ఆచరించాలి.  ఈ ఐదు రోజులు రాత్రి తోలి అర్ధ భాగంలో నీరాజన విధి నిర్వర్తించాలి.  ఈ ద్వాదశి వెళ్ళిన మరునాడు త్రయోదశి రోజున అపమృత్యు నివారణార్ధం యమునికి బలిదీపాన్ని ఇవ్వాలి.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb