అక్షయ అనగా క్షయము లేనిది (నాశనం లేనిది). వైశాఖ మాసాన పౌర్ణమి తరవాత మూడవ రోజు వచ్చేది తృతీయ. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ఇరువి ఏడు న న వచ్చింది. ఈ రోజు ఏ పని మొదలు పెట్టిన మంచిది అంటుంటారు. ముఖ్యం గా బంగారం కొంటుంటారు.
పురాణాలలో అక్షయ తృతీయ కి ఉన్న ప్రాముఖ్యం: ఇదే రోజు పాండవులు కృష్ణుడి వద్ద నుంచి అక్షయ పాత్ర ను పొందిన రోజు, అలాగే కుచేలుడు శ్రీ కృష్ణుడికి అటుకులు తినిపించి బంగారు పట్టణాన్ని పొందిన రోజు అని కూడా అంటారు. అంతే కాకుండా వ్యాసుడు మహబారతాన్ని రాయడం ప్రారంభించింది కూడా ఇదే రోజు. అలాగే ఈరోజు ఏదైన పని మొదలు పెడితే శుభం అని, బంగారం కొంటె ఇంకా మంచిది అని చెప్తారు.