Valuable Information

సీమంతము

సీమంతము 


        గర్భాదారణమైన తరువాత ఆరవ నెలలోగాని  ఎనిమిదవ నెలలోగాని ఈ సంస్కారము జరుపబడుతున్నది.  గర్భం మాంసం పిండం నుంచి కాళ్ళు చేతులు మొదలగు అవయవాలు ఏర్పడిన తరువాత ప్రధాన అంగమైన హృదయము ఎర్పదేతప్పుడు గర్భంలోని శిశువులో చైతన్య శక్తి పుడుతుంది.  అప్పుడు తల్లిలోను ఒక విలక్షణమైన (శారీరక మానసికములు) మార్పు ఆరంభమవుతుంది.  ఇది మామూలుగా జరిగే మార్పులకంటే గొప్పగా జరిగే మార్పు.  అది రెండు హ్రుదయాలుండేది.  ఒకటి గర్భంలో వుండే పిల్లవానిది.  రెండవది తల్లిది.  హృదయం చైతన్యాదిష్టం, కావున చైత్న్యంతోపాటు గర్భంలోని జీవుడు, ఇంద్రియ విషయములో అభిరుచి కలవాడు అవుతున్నాడు.  ఆ సంకల్పాలు మాత్రు హృదయంపై ప్రతి బింబితమవుతున్నాయి  .  స్త్రీకి రెండు హృదయాలు ఎర్పదదమువలననే ఆమె హృదయంలో సంకల్పాలను, కోరికలను ఎవిధంగానైనాను తీర్చవలసిన భాద్యత పురుషునిపై ఉంది.  అట్లు చేయకుంటే గర్భంలోని బాలకుని కోరికలు తీరకుండా అలాగే వుంటాయి.  కరాట దర్శులైన మహర్షులు వీటన్నింటిని దృష్టిలో వుంచుకొని క్షేత్ర స్థానంలో వుండే స్త్రీకి మరల సంస్కారం చేయ వలసిన అవసరాన్ని గుర్తించినారు.  గర్భంలో వుండే  బాలకుని హృదయం పై  నిర్మల భావనలు ముద్రించాదానికే యీ సంస్కారాన్ని ఏర్పరచినారు.  

            ఈ పవిత్ర సంస్కారములో చెప్పే మంత్రాలు - నేయి గలిపిన యజ్ఞశేష ప్రసాదము, భర్త మేదిపుల్లతో గర్భిణికి పాపట తీసి వెంట్రుకలు చిక్కు దీయడం పెద్ద ముత్తయుడువులు పాడే మంగలాన్ని ప్రసాదించే పాటలు, వృద్దుల ఆశీర్వచనాలు ఒక లౌకిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.  సీమంతం నాటి దృశ్యాలు - వైదిక కలాపము గర్భిణి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.  తనకు మంచి గుణాలు గల బిడ్డడు పుడతాడనే నమ్మకం ద్రుదపడుతుంది.  ఈ సీమంత సమయములో రామాయణ మహాభారతాది గ్రంధ పఠనం చేసి తీరవలెను.  దానివల్ల వీరమాత అవుతుంది.  వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే కొడుకును కంటుంది.

              కాని ఇప్పటి సీమంత సంస్కారం మహావైభవంగా పేరంటాలు చేయడంతో రకరకాల పిండివంటలు ప్రదర్శన పెట్టడంలో పట్టు చెరలు గట్టించడంతో నిలిచిపియింది.  ఆ సమయంలో పవిత్రమైన మంచి భావాలు గల పాటలు పాడే వారే కరువైనారు.  ఈ సంస్కారములో అప్పుడే కాచిన ఆవునేయ్యు కలిపిన పులగాన్ని భగవంతునికి నివేదించి గర్భినితో తృప్తిగా తినిపించాలి.  ఈ సంస్కార సమయములో పవిత్రమైన, శ్రావ్యమైన సంగీతాన్ని, మంచి మాటలను, భక్తి భోదనలను వినిపించాలి.  సంస్కార కలాపము పూర్తిగా ముగిసిన తరువాత కడుపునిండా బిడాలు కలిగిన పెద్ద ముత్తైదువలు చిరకాలము జీవించు బుద్ది మంతుడైన వంశోద్దారకులైన బిడ్డలను కనాలని, చిరకాలం సౌభాగ్యవటిగా వర్ధిల్లాలి అని ఆశీర్వదించి మంగళ కరమైన పాటలు పాడుతారు.  

             ఈ విధానం కర్మకాండకు సంభందించిన క్రియా కలాపం మాత్రమె కాదు వైజ్ఞానికం కూడా.  గర్భవతులకు నేటితో చేసిన పదార్ధాల అవసరం ఎంతైనా ఉంది.  ఆహారంతో శరీరాన్ని పోషించుకోవడమే కాక కడుపులో పెరిగే బిడ్డ శరీరాన్ని పోషించవలసి ఉంది.  కావున ఆమె పుష్టి కరమైన పదార్ధాలను తింటున్డాలి.  పులగామనేది సరిసమానముగా పొట్టు పెసర బేదాలు వేసి వండి నేటితో కలిపినది.  పుష్టికరమైన రుచిగల ఆహారపదార్దము.  దానిలో పోషక పదార్దాలెన్నో వున్నాయి.  తగినంత నేతిని వాడడంవల్ల సుఖ ప్రసవం అవుతుంది.  సంతానం ఆరోగ్యంగా పుష్టిగా వుంటుంది.  

సీమంతము చేయు విధానము:  భార్య భర్తలు తూర్పు ముఖముగా కూర్చుని గణపతిపూజ, పున్యాహవాచనం చేసి, భార్య ఎడమ వైపు కూర్చుని కంకదారణ చేయవలెను, బ్రాహ్మణ పూజ చేసి, దక్షిణ తాంబూలము లిచ్చి ఆశీర్వాదము పొందవలెను.  కొందరు సీమంత హోమమును చేసెదరు.  అప్పుడు నాలుగు రోజులు ముందుగానే మట్టి మూకుల్లలో యవలు చల్లి మొలకేట్టిన్చావలెను.  ఆ మొలకలను, మేదికోమ్మను, వీటిని కట్టె తాడును పాత్రా సాధనంలో పెట్టవలెను.  జయాది హోమము జరిగిన తరువాత తన భార్యను శుభ ముహూర్తమందు అగ్నికి పడమరవైపు తూర్పు ముఖముగా కూర్చుండబెట్టి, తాను పశ్చిమ ముఖుడై ఉంది వ్యాహృతులను "శాకామహయస్తాస్తేవాకే" అను మంత్రములను చెప్పి, మూడు దర్భ కట్టలు మేడి కొమ్ముతో చేర్చి, ఒకే మారు గ్రహించి నాభి ప్రదేశము మొదలు పాపిటి వరకు వూర్ధ్వముగా పోరాలించి పడమరవైపు పారవేసి ఉదకమును స్ప్రుశించావలెను.  నక్షత్రములు కనిపించు వరకు గర్భిణి స్త్రీ మౌనముగా ఉండవలెను.  తరువాత దైవమును ధ్యానించి మౌనమును విడువవలెను.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb