Valuable Information

గర్భాదాన సంస్కారము

గర్భాదాన సంస్కారము:
      షోడశ సంస్కారములలో మొదట పేర్కొనబడినది గర్భాదానము.  దేనినే "అదానము" అని అంటారు.  సంతానము తల్లి తండ్రుల యొక్క ఆత్మ హృదయము, శరీరమునుడి జనిస్తాయి.  అందువలన మాతాపితరుల స్థూల, సూక్ష్మ, శరీరములందు ఏయే దోషములు ఉండునో,  ఆయా దోషములు వారి వారి స్నాతానమునకు కూడా సంక్రమిస్తాయి,  కనుక మాతా పితరులు మంచి కాలమందు సత్వగునమును అవలంభించి, మనస్సులో దైవ భావనతో సంతానోత్పత్తిలో ప్రవర్తించ వలెను.  
   
        ఈ విషయమును గురించి శ్రీ కృష్ణుడు గీతలో "ధర్మవిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ" (మనుష్యులందు ధర్మ విరుద్దము కాని కామము తానై వున్నాను)  అని చెప్పినాడు.  తల్లి తండ్రుల చిత్త వృత్తుల ననుసరించే సంతానము యొక్క మనస్సు, శరీరము మున్నగు ఎర్పడునవని తెలుపుతో.. 
                    ఓం పూశాభాగం సవితామే దదాతు|
                    ఓం విష్ణు యోనిం కల్పయిటు|| 
          ఇత్యాది మంత్రములు గర్భాదాన సంస్కార సమయమునందు పఠింపబదుతాయి.  ఇదియే ఈ సంస్కారమందు తెలుపబడినది.  
 
          పూర్వం బాల్య వివాహములు జరిగేవి.  ఆ దంపతులు యుక్త వయస్కులైన పిదప మంచి ముహూర్తము చూసి గర్భాదానము చేసేవారు.  గర్భాదానము రోజు ఉదయము పునస్సంధానము చేసేవారు.  అంతే అగ్ని హోత్రాన్ని వివాహానంతరము, గర్భాదానము రోజున తిరిగి ప్రతిష్టించి హోమములు చేసేవారు.  (ఇప్పుడు రజస్వల అనంతర వివాహములే జరుగుచున్నవి) వివాహానంతరము ఒకతి, రెండు రోజులలో ముహూర్తము చూడక, ఏ విధమైన సంస్కారము చేయకుండా కేవలము వేడుకగా గర్భాదాన కార్ర్యక్రమం చేస్తున్నారు.  అలా చేయడం శాస్త్ర సమ్మతం కాదు.  

గర్భాదాన ప్రాశస్త్యము 

       షోడశ కర్మలలో మొదటిది, జీవి ఆవిర్భావానికి ముందే జరుపబడు ముఖ్యమైన సంస్కారం గర్భాదానం, గర్భాదానం వలన పిండోత్పత్తి జరిగి జీవి ఆవిర్భావానికి దోహదం చేస్తుంది.  ఆత్తి గర్భాదానం ఎప్పుడు చేయాలి, గర్భాదాన సమయ ప్రాధాన్యత ఏమిటి?  అని ఆలోచిస్తే మన శాస్త్రం గర్భాదాన ముహూర్తం గురించి తెలుస్తుంది.  

         స్త్రీలకు రాజోదర్శన దినము మొదటి పదహారు రాత్రులు ఋతు రాత్రులు అనబడును.  అందులో మొదటి నాలుగు రోజులు గర్భాదానం పనికి రాదు.  ఐదవ దినం మొదలు పుత్ర సంతానము కోరువారు సమదినములండును, పురుష రాశులైన మేష, మిధున, సింహ, తులా, ధనుస్సు, కుంభముల యందును ఈ రాశులలో పురుష గ్రహాలూ వుండగాను, బృహస్పతి గర్భాదాన లగ్నానికి లగ్న, పంచమ, నవమ స్థానములందు వుండగాను గర్భాదానం చేసిన పుత్ర సంతానము కలుగునని, అదే విధముగా స్త్రీ రాశులైన వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, మకర, మీనా రాశుల యండినాను, లగ్నము స్త్రీ గ్రహములచే చూడబడిననూ, లగ్న, పంచమ నవమ స్థానముల యందు బృహస్పతి లేకుండగా గర్భాదానం చేసిన స్త్రీ సంతానం కలుగునని శాస్త్ర వచనం, గర్భాదాన సమయాన్ని గురించి తెలియజేస్తూ గర్భాదానం సూర్యోదయ, సూర్యాస్తమయ కాలములందూ, పగటివేళ, పంచ పర్వములైన కృష్ణాష్టమి, కృష్ణ చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రమనములందు, శుక్ల చతుర్దశి యందు ఏకాదశి మొదలైన వ్రత దినములందు, శ్రాద్ధ దినమందు, వ్యతీపాత మాహాపాతమండును, పాపగ్రహములు కూడిన నక్షత్రమందు, అశ్విని, భరణి, ఆశ్లేష, మఘ, జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు దంపతుల జన్మ నక్షత్రములందు, రెండు పక్షముల పుష్టులందు, పరిఘనామ యోగము యొక్క పూర్వ భాగమందు, వైద్రుతినామ యోగాములందు, బార్యా భర్తల రాశికి ఎనిమిదింట చద్రుడుండగా గర్భాదానము పనికి రాదు.

          కాని నేటి సమాజములో గర్భాదాన ముహూర్తము చాలామంది పాతిన్చుటలేదు.  పెండ్లి అయినరోజో లేదా వారికి వీలు కలిగిని రోజో గర్భాదానాన్ని చేస్తున్నారు.  దీనివలన సత్సంతానం కలుగక బాధ పడుతున్నారు.  దీనికి ముఖ్య కారణం గర్భాదాన ప్రాశస్త్యం తెలియకపోవడమే.  కేవలం ఏదో ఒక రోజు గర్భాదానాన్ని నిర్ణయించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారేగాని మన మహర్షులు నిర్దేశించిన విధంగా శాస్త్ర  బద్దంగా ఎవరు పాటించుట లేదు.  ఇందుకు ఒక ఉదాహరణ:- 
 

           సంతాన వాంఛతో  వచ్చిన దితి తో కశ్యప ప్రజాపతి "ఇది సాయం సంధ్యాసమయం ఇది గర్భాదానానికి తగిన సమయం కాదు"  అని వారించినా వినక, దితి కశ్యప ప్రజాపతితో కూడుట వలన లోకకంతకులైన హిరణ్యాక్ష, హిరణ్యకషపులు జన్మించినారు.  కాబట్టి మన పురాణాల ద్వారా గర్భాదానం తగిన సమయలోనే చేయాలని తెలుస్తుంది.  గర్భాదాన లగ్నాన్ని నిర్నయిన్చాదములో ముఖ్య ఉదేశ్యం, అప్పటి వరకు పరిచయములేని ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఒక్కటై వారి మధ్య ఆకర్షణ , ప్రేమ కలిగి వారి ప్రతిఫలం సంతాన రూపంలో రావాలని శుభ ముహూర్తాన్ని నిర్ణ యిస్తారు.  అందుకే లగ్నాట్టు పంచమంలో బృహస్పతి వుదాలని లేదా ఏదైనా శుభ గ్రహం వుండాలని శాస్త్ర వచనం.  ఎందుకంటె పంచమం ప్రేమ స్థానం కాబట్టి ఇద్దరి మధ్య అనురాగం కలగాలంటే ప్రేమ స్థానమైన పంచమంలో శుభాగ్రహాలున్డాలి.  "అదానము" అనగా "ఉంచడము" గర్భాదానము అనగా గర్భమునందు ఉంచడము అని అర్ధము.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb