Valuable Information

సకల-శుభాల-సంక్రాంతి

మహా పురుషులు జన్మమెత్తిన రోజులు, దుష్టులు కడతేరిన రోజులు సాధారణంగా మనకు పండుగలయ్యాయి. ఇవి కాకుండా గ్రహసంచారంలో మానవునికి విక్రాంతి ఏర్పడే, మంచి జరిగే పుణ్య దినాలను కూడా పర్వదినాలుగా స్వీకరిస్తున్నాం. సంక్రాంతి ఇటువంటి పర్వమే. సంక్రాంతికి రైతులకు ధాన్య రాశులు ఇంటికి వస్తాయి. ఈ పండుగ రోజుల్లో మహాసందడిగా వుంటుంది. గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, ముంగిళ్ల లో తీరైన ముగ్గులు, గొబ్బెమ్మలు- అంతా పచ్చగా దర్శనమిస్తుంది.సంక్రమణమంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం వల్ల చలిగాలుల నుంచి వెచ్చని రక్షణగా వెచ్చని సంతోషసౌభాగ్యాలు సమకూరుతాయని విశ్వాసం. కనుక ఇది సంక్రాంతి అయింది.



sankrti సంవత్సర కాలంలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు. ఈ రకంగా చూస్తే ప్రతి మాసంలో సంక్రాంతి ఏర్పడుతుంది. ఈ నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇది మకర సంక్రాంతి అయింది. పన్నెండు రాశుల సంక్రాంతుల్లోనూ ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణం, పుష్య మాసంలో వచ్చే మకర సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మొదటి సంక్రమణం దక్షిణాయనాన్ని, మకర సంక్రమణం ఉత్తరాయనాన్ని ప్రారంభిస్తాయి.

ఉత్తరాయణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.ప్రళయ స్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుంటే ఆది వరాహ రూపంలో విష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజుననే ఉద్ధరించాడంటారు. వామ నావతారంలో విష్ణువు బలి చక్రవర్తి శిరస్సుపై కాలు పెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఇదే రోజున అని చెప్పుకుంటారు. మహాభారతంలో కురువృద్ధుడు భీష్ముని గురించి తెలియనివారుండరు. ఇతడే దేవవ్రతుడు. గంగాశంతనుల అష్టమ సంతానం. పాండవులంటే మక్కువ మెండే అయినప్పటికీ రాజ్యాధినేత ధృత రాష్ట్రుడికి భీష్ముడు అండదండలుగా వుండి కురు సామ్రాజ్యాన్ని రక్షించే కర్తవ్యాన్ని భుజాన మోశాడు. అందుకే భీష్ముడు కురువృద్ధుడు అయ్యాడు. కురు క్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలకు కాయం కూలి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి వుండి ఆయువులు విడుస్తాడు. పుణ్యగతులు మకర సంక్రమణ వేళ సంక్రమిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని, ఈ నెలలో మర ణించినవారికి శాశ్వత పుణ్యలోక ప్రాప్తి వుంటుందని నమ్ముతారు. ఈ మాసంలో బలి చక్రవర్తి పాతాళలోకం నుంచి వచ్చి ఇంటింటా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రా ముఖ్యాన్ని పరిశీలిస్తాడట. అన్ని పండుగల కన్నా ఇది ప్రాముఖ్యం గల పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు.

mahalaxmi మన పెద్దలకు పుణ్యలోకాల్ని ప్రసాదించే పండుగ అయినందున కూడా ఇది పెద్దల పండుగ లేదా పెద్ద పండుగ అయింది. ఈ రోజులలో స్ర్తీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముం గిళ్లలో రంగవల్లులు తీరు స్తారు. వాటి చుట్టూ వైకుం ఠ ద్వారాలు తెరుస్తారు. తెల్లవారుజాముననే జంగపుదేవరలు, బుడ బుక్కల దొరలు, పంబల వాండ్లు, బైనా యుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటా రు. వారి వారి తీరుల లో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సం్ర మణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణు వుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని నమ్మకం. ఈ పండుగకు లక్ష్మీదేవికి సంబంధం వున్నదని ఒరిస్సా ప్రజలు నమ్ముతారు. ఆమె పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇళ్ల్లలోకి ప్రవేశించిం దట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణ తో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింత లేకుండా ఈ మార్గశిర, పుష్య మాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందట.

sankrti1 అందువల్ల నే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు పెడతారు. అమె మెత్తని పాదాలు పె ట్టేందుకు వీలుగా ఆవుపే డ ముద్దలపై పెద్ద పువ్వు లయిన తామర, గుమ్మడి పూలను వుంచు తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని కొలవటం కూడా ఆచారం. గొబ్బి లక్ష్మీ అంటే భూమాతనే. ఆమెను కొలిస్తే బోలెడు సస్యాలను ప్రసాదిస్తుందని విశ్వసి స్తారు. ఈ పర్వదినం శ్రీకృ ష్ణునికి ము ఖ్యమైంది కాబట్టి గోపికలు గొబ్బి పాటలు పాడుతూ ఇంటింటికీ వస్తారు. సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ. రెండవ రోజు సంక్రాంతి. మూడవ రోజు కనుమ పండుగ (పశువుల పండుగ). భోగి పండుగనాడు కష్ట కాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమి వేసి వెచ్చని ఊహ లతో భోగభాగ్యాలను చవి చూడటం మొదలు పెడతారు. ఉత్త రాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆరోజు కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు పెడతారు. ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచా రం.

భోగిపండ్లుగా రేగుపండ్లను వాడుతారు. వీటినే బదరీ ఫలాలంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపలపై ఆ ఫలా లను పోస్తే నిండారా విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు ఆడపడుచులను, అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ. ఆ రోజు ఎవరూ ఎక్కడికీ ప్రయాణం చేయరు. ఆ రోజును ఆవులను, గేదెలను, కోడ దూడలను, పెయ్యలను, ఎడ్లను పసుపు కుంకుమలతో అలంకరించి తప్పెట్లు తాళా లతో ఊరేగిస్తారు. ఈ విధంగా సంక్రాంతిని మూడు రోజుల పాటు చూడముచ్చటగా జరుపుకుంటారు. అటు పురుషులకు, ఇటు స్ర్తీలకు ఎంతో సంతోషాన్నిచ్చే పండుగ ఇది.

జ్యోతిష శాస్తప్రరంగా...

sankrti2 జ్యోతిష శాస్తప్రరంగా, జనవరి 14 వ తేదీన సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశ్యధిపతి సూర్యనం దనుడే. మకరరాశ్యాధిపతి శనీశ్వరుడు. కానీ వాళ్లిద్దరికీ చుక్కెదురు. అయినా, సూర్యుడు తన సింహ గర్జనలనీ, సహజ తేజో విలాసాలనీ పక్కనపెట్టి తన కొడుకు శని ఇంట్లో నెలరోజులపాటు గడుపుతాడు. ఇది పుత్ర వాత్సల్యానికి సజీవ ఉదాహరణ. కనుకనే, ఈ అత్యాధునిక యుగంలో కూడా, కొడుకులెంత చులకనచేసినా, కోడళ్లు ఎంతగా ఈసడించు కున్నా, ఆ ఇంటి మీదికాకి, ఈ ఇంటి మీద వాలకపోయినా, మకర సంక్రాంతినాడు, తండ్రులు తమ రక్తంపంచుకు పుట్టిన కొడుకుల ఇళ్లలో కనీసం ఒక్క మెతుకైనా కతికి, వాళ్లకి యధాశక్తి కొత్తబట్టలూ, నగానట్రా, డబ్బూదస్కం, ఇచ్చిరావడం అనా దిగా వస్తున్న సదాచారం.

రాశ్యనుసారంగా...సూర్యుడు ఒక్కొక్కరాశిలో 30 రోజులపాటు వుండడంతో, ద్వా దశి రాసుల రీతిలో, 12 సంక్రాంతులు కూడా వస్తాయి. అయితే, సూర్యుడు మేష రాశిలో ప్రవేశించే మేష సంక్రాంతి, నాడే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అలా గే, సూర్యుడు, మకర రాశిలో ప్రవేశించే జనవరి 14 వ తేదీనే ఉత్తరాయన పుణ్య కాలం మొదలౌతుంది.భారతీయ కాలమానం చాంద్రమానాను సారం గణిం చడం, పరిగణించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ సంక్రాంతి సౌరమాన సరళి లో వస్తుంది కనుక, ప్రతి ఏటా మకర సంక్రాంతి జనవర 14 వ తేదీనే వచ్చి తీరు తుంది. మరో విధంగా చూస్తే, చాంద్ర మానం ప్రకారం, మకర సంక్రాంతి, పుష్య మాసం చివరిలో మాఘమాసం మొదలు కావడా నికి వారం రోజుల ముందు వస్తుంది.

భారతీయ రుతుచక్రంలో...

చాంద్రమానాను గుణమైన, భారతీయ రుతుచక్రంలో, మార్గశిర, పుష్యమాసాలు హేమంతరుతువు. అంటే, ఇంగ్లీష్‌ కేలండర్‌ ప్రకారం నవంబర్‌ 20 నుంచి, జనవరి 20 దాకా, హేమంత రుతువే అవుతుంది. ఉష్టోగ్రత కూడా ఎంతో ఆహ్లాదకరంగా, 20-25 డిగ్రీల మధ్యనే వుంటుంది. ఆ తరువాత, చాంద్రమాన సరళిలో, మాఘ, పాల్గుణ మాసాలలో, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ను అనుసరించి, జనవరి 20 నుంచి, మార్చి 20 దాకా, శిశిర రుతు వు కొనసాగు తుంది. శిశిర రుతు వునే చలి కాలం. అంత చలిలో నూ, 10 డిగ్రీల కంటే తక్కువైన ఉష్టో గ్రతలో నూ, అప్పు డప్పుడూ, సూర్యరశ్మి వెచ్చగా సోక డంతో, యవ్వన మనోవ నిలో వురక లేస్తూ, పరు గులు తీస్తున్నంత ప్రస న్నం గా వుం టుంది, వాతా వరణం.

పుష్కల ఫల ‘సాయం’ తో...

భారతీయ ఉపఖండం లో నేకాక, దక్షిణ ఆసియా దేశా లన్నిటిలోనూ, ఈ రుతువులో, ఫలసాయాలు పుష్కలంగా చేతి కొచ్చి, ఇంటింటా సిరుల పంటలు పండుతాయి. అలా, మకర సంక్రాంతి భారతీయులకి, విశిష్టమైన భౌగోళిక, వ్యవసాయక, ఆర్థిక ప్రాధాన్యత సంతరించిపెడుతుంది.

ఉత్తరాయణారంభంతో...ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరదిశగా సాగిపోవడం కదా? దాంతో, పగటికాలం పెరిగి, రాత్రుళ్లు తరిగితాయి. అప్పుడు, పంటకోతలకీ, ఫలసాయం చేరివేతలకీ, పగటిపూట తగినంత వ్యవధి వుంటుంది కదా! ఏదేమైనా, భారతీయ భూ మండల పరిమాణం, ప్రమాణం, తదనుకూలమైన వ్యవసాయిక వాతా వరణం, సాంస్కృతిక నేపథ్యం, ప్రాదేశిక వైవిధ్యం, సంక్రాంతి సంబరాలలో కూడా చోటుచేసుకుంటాయి.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb