Valuable Information

రథసప్తమి

ఈ రోజు రథసప్తమి.

లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిది ..రధసప్తమి .

సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి ,ఆవుపిడలపై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

ఉష (చాయాదేవి ), ప్రత్యూష సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి

ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిముర్తిస్తూ దివాకరః

సూర్య భగవానుడు ఉదయం వేళ బ్రహ్మ రూపంగాను, మద్యాహ్నం ఈశ్వరుని గాను, సాయంత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవునిని ప్రార్దిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది.

మాఘ శుద్ద సప్తమి రోజున రధసప్తమి గా జరుపుకొంటాము. సప్త అశ్వ రధారూడా....7 గుర్రాలతో ఉన్న రధా న్ని అధిరోహించే సూర్య భగవానుడు తన దిశా నిర్దేశమును ఈరోజు నుండే మార్చుకొంటాడు.


ఈరోజు మనం జిల్లేడు ఆకులను తలమీద, భుజాల మీద ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాము. తర్వాత 7 చిక్కుడు ఆకులలో పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యం గా సమర్పించి పూజిస్తాము. రోజు నుండి పగటి వేళ సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.

రామాయణం లో ని ఆదిత్యహృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది.


సూర్యాష్టకమ్

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర,
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో2స్తుతే.

సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

లోహితం రథ మారూఢం సర్వలోక పితామహమ్,
మహాపాపకరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

త్రైగుణ్యం చ మాహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్,
మహాపాపకరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బృంహితం తేజసాం పుంజం వాయురాకాశ మేవ చ,
ప్రభుం చ సర్వలోకాకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బంధూకపుష్ప సంకాశం హారకుండల భూషితమ్,
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

విశ్వేశం విశ్వకర్తారం మహాతేజహ్ ప్రదీపనమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
***************************************
బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్,
సాయం ధ్యాయేత్ సదావిష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb