Valuable Information

మహాశివరాత్రి

'' మాఘ పాల్గుణ మోర్మద్యే కృష్ణ పక్షే చతుర్దశి
శివరాత్రి రితిఖ్యాతా సర్వ యజ్య్నోత్తమోత్తమా
శివరాత్రి సమం నాస్తి వ్రతం పాప క్షయాపాహం
యాత్క్రుత్వా సర్వ పాపేధ్యో ముచ్యతే నాత్ర సంశయః ''

మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివమైన, శుభప్రదమైన శివుని రాత్రి అని అర్ధం.అర్ధరాత్రి వరకూ చతుర్దశి తిథి ఉన్న దినమునే శివరాత్రి అంటారు.ఉపవాసము, అభిషేకాది పూజ, జాగరణము ఇవి మూడు శివరాత్రినాడు చేయవలసిన కార్యములు. మహాశివరాత్రినాడు శివుడ్ని అభిషేకించి, అర్చించి, ఉపవశించి, జాగరణ కావించే శివరాత్రి వ్రతం కన్నా మించిన గొప్ప వ్రతం లేదు.

"లింగగర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం
లింగ బాహ్యత్ పరంనాస్తి తల్లింగచ ప్రపూజయేత్ "

సమస్త చరచరాత్మకమై ముల్లోకాలు, సకల జగత్తు లింగంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ మహా లింగానికి బాహ్యగతంగా ఏమీ లేదు. శివలింగంలో లింగభాగం ఆకాశమని, పీట్ట భాగమే భూమి అని అది సకల దేవతలకు ఆలయం వంటిదని పెద్దల భావన. " శి " పాపాలను పోగొట్టేది." వ " మోక్షాన్ని ప్రసాదించేది. అనగా పాపాలను పోగొట్టేది, మోక్షాన్ని ప్రాసాదించేది శివలింగం.

మహాశివరాత్రి

'' మాఘ పాల్గుణ మోర్మద్యే కృష్ణ పక్షే చతుర్దశి
శివరాత్రి రితిఖ్యాతా సర్వ యజ్ఞోత్తమోత్తమా
శివరాత్రి సమం నాస్తి వ్రతం పాప క్షయాపాహం
యాత్క్రుత్వా సర్వ పాపేధ్యో ముచ్యతే నాత్ర సంశయః ''

మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివమైన, శుభప్రదమైన శివుని రాత్రి అని అర్ధం.అర్ధరాత్రి వరకూ చతుర్దశి తిథి ఉన్న దినమునే శివరాత్రి అంటారు.ఉపవాసము, అభిషేకాది పూజ, జాగరణము ఇవి మూడు శివరాత్రినాడు చేయవలసిన కార్యములు. మహాశివరాత్రినాడు శివుడ్ని అభిషేకించి, అర్చించి, ఉపవశించి, జాగరణ కావించే శివరాత్రి వ్రతం కన్నా మించిన గొప్ప వ్రతం లేదు.

"లింగగర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం
లింగ బాహ్యత్ పరంనాస్తి తల్లింగచ ప్రపూజయేత్ "

సమస్త చరచరాత్మకమై ముల్లోకాలు, సకల జగత్తు లింగంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ మహా లింగానికి బాహ్యగతంగా ఏమీ లేదు. శివలింగంలో లింగభాగం ఆకాశమని, పీట భాగమే భూమి అని అది సకల దేవతలకు ఆలయం వంటిదని పెద్దల భావన. " శి " పాపాలను పోగొట్టేది. " వ " మోక్షాన్ని ప్రసాదించేది. అనగా పాపాలను పోగొట్టేది, మోక్షాన్ని ప్రాసాదించేది శివలింగం.

దీనికి ఒక పురాణగాధ కలదు. ఒకసారి బ్రహ్మ, విష్ణుమూర్తుల మధ్య అహంకారము తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్ప వారో తేల్చుకోవాలనే స్థితికి పోటీ పడసాగారు. వారిని గమనిస్తున్న శివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగద్రొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాటం చెప్పాలనే ఉద్దేశంతో "మాఘమాసం చతుర్దశి నాడు" వారి ఇరువురుకి మధ్య "జ్యోతిర్లింగంగా"రూపు దాల్చాడు. వారు ఇరువురు ఆ లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోవాలని, విష్ణుమూర్తి వరాహ అవతారం దాల్చి జ్యోతిర్లింగం అడుగుభాగాన్ని వెతుకుతూ వెళ్ళగా, బ్రహ్మ దేవుడు హంసరూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణు వేడుకుంటారు. అపుడు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనం ఇచ్చి, అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టాడు. దానితో బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి, వానికి విశేష పూజలతో సేవించి కీర్తించినారు.ఆ పర్వదినమే శివునకు పరమ ప్రీతికరమైన "మహాశివరాత్రి" అయినది. క్షీరసాగర మధనాన పుట్టిన హాలాహలాన్ని శివుడు కంటాన నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున చేయవలసినవి ఉపవాసము, అభిషేకాది పూజ, జాగరణ. మన భక్తీ కొలది అమోఘమైన ఫలితమునిచ్చును.
అఖిలాండ కోటి బ్రంహాండ నాయకుడు అయిన పరమశివుని గురించిన దివ్యమంత్ర రాజమే శివపంచాక్షరీ మంత్రమైన " ఓం నమ: శివాయ ". ఈ పంచాక్షరీ మంత్రంలోని " న " అక్షరం బ్రహ్మను .. భూమిని, " మ " అక్షరం విష్ణువును .. జలాన్ని, " శి " అక్షరం రుద్రున్ని .. అగ్నిని, " వా " అక్షరం మహేశ్వరుని .. వాయువుని, " య " అక్షరం సదాశివున్ని ఆకాశాన్ని సూచిస్తాయి. సకల సృష్టి ప్రణవం నుండే పుట్టగా, ఆ ఓంకారముతో కూడిన శివతత్వంయమే ఈ సృష్టి అంతా. తారకాసురుని వధించినప్పుడు అతని మెడలోని అమృతలింగం కుమారా స్వామిచే చేదింపబడి శివుడు పంచముఖుడు కనుక అవి ఐదు ఖండాలుగా అయి స్వయంభువాలై వెలసిన " శివ పంచముఖ రూపాలే " పంచారామాలు.

1. అమరామారం : " అఘోర రూపం " గుంటూరు జిల్లా
2. ద్రాక్షారామం : " తత్పురుష రూపం " తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామం
3. కుమారారామం: " వామదేవ రూపం ", తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట.
4 . సోమారామారం: " సద్యోజాత రూపం" పశ్చిమ గోదావరి జిల్లా, గునుపూడి భీమవరం.
5. క్షేరారామం: " ఈశానరూపం " తూర్పుగోదావరి జిల్లా., పాలకొల్లు.
ఈ పంచారామాలను సందర్శిస్తే పంచముఖ పరమేశ్వరుని దర్శించినట్లే. కనుకనే ఎందఱో భక్తులు మహాశివరాత్రి. నాడు పంచారామ యాత్ర చేస్తారు.

శివరాత్రి పర్వదినాన మనసా వాచా కర్మణా ప్రతివారు " ఓం నమశివాయ " అన్న మంత్రాన్ని రోజంతా స్మరిస్తూ ఉండాలి. మహాశివున్ని శివరాత్రినాడు అర్చించి, అభిషేకించి, దర్శించి జాగరణ, ఉపవాసాలు చేసినవారు శివనుగ్రానికి పాత్రులవుతారు.

విశేష శివరాత్రి ఫలితాలు పొందేందుకు ( సకలపూజలు.కాం ) మేము మీకోసం ఉచితముగా అభిషేక ఏర్పాట్లు చేయడం జరిగినది. మీ గోత్రనామాలను మాకు మెయిల్ చేసినట్లయితే మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో అభిషేకం జరిపించగలము.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb