Valuable Information

చొల్లంగి అమావాస్య , నాగోబా జాతర, తెప్పతిరునాళ్లు

చొల్లంగి అమావాస్య

పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.

తెప్పతిరునాళ్లు

పుష్య బహుళ అమావాస్య అయిన ఈ రోజు, సింహాచలం కొండ దిగువ భాగంలో ని అడవివరంలో గల ఉద్యానవనం, పుష్కరణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్న కు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్లు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

నాగోబా జాతర

పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన ‘నాగోబా’  పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం.  ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. మనరాష్ట్రం నుంచే కాకుండా పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.

ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర   నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ  సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్‌కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు.  గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb