Valuable Information

ప్రాతః కాలములో అనుసరించ వలసిన పద్ధతులు

1. ఉత్థాయ పశ్చిమే యామె  రాత్రి వాసం పరిత్యజేత్ ||
    ప్రక్షాల్య హస్త పాదాస్యాన్యుపస్ప్రుష్య హరిం స్మరేత్ ||
                                                                                [ఆచారేందౌ  అను గ్రంధములో అన్గిరుడు చెప్పెను ] 

 
ఐదు ఘటికలు పొద్దు ఉండగా నిదుర లేచి రాత్రి ధరించిన వస్త్రములు విడచి అన్యవస్త్రములను ధరించి హస్త, పాద ముఖములను కడుగుకొని  నోటిని శుభ్రపరుచుకొని ముందుగ మాతా, పితరులకు, వృద్ధులకు, దేవతాపటములకు నమస్కరించి పంచాయతన స్తోత్రములను, లేదా ఇతర దేవతా స్తోత్రములను పఠించి దినచర్యలను ప్రారంభించవలెను.
 
2. శ్రోత్రీయం సుభగం గాంచ అగ్నిమగ్ని చితం తధా ||
ప్రాతరుత్తాయ యః పశ్యేత్ ఆపద్భ్యః స ప్రముచ్యతే ||

ప్రాతఃకాలమునందు శ్రోత్రియుని [ఆచారములు పాటించి శుచిగా ఉండే వాడిని ], సజ్జనుని, గోవును, అగ్నిని, అగ్నిహోత్రము చేయువానిని, చూచినా వారికి సర్వ ఆపదలూ తోలగునని  కాత్యాయనుడు
ఆచారేందౌ  అను గ్రంధములో  చెప్పెను

 

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb