Valuable Information

జాతకర్మ

జాతకర్మ 

 


 దీనినే కొన్ని ప్రాంతాలలో "బాలసారె" అని అంటారు.  
పుట్టిన వెంటనే జాతకర్మ చేయవలెను.  లేదా 11, 12 రోజులలో చేయవలెను.  ఈ సంస్కారము శిశువు భోమిపై పడిన తరువాత చేయునది.  కొన్ని ప్రాంతాలలో యవపు పిండిని, బియ్యపుపిండిని, బంగారముపై రుద్దిన తేనెను, నెయ్యిని, శిశువు నాలుకకు మంత్రోచ్చారణ జరుగుతుండగా తండ్రి రాస్తాడు.  యవ, బియ్యపుపిండి వలన మేధా, ఆయుర్దాయము, సువర్ణ సంపర్కమువలన వాతదోశము హరించుటయే  గాక రక్తముయోక్క వూర్ధ్వగమనమును అరికట్టి, మూత్ర విసర్జన సక్రమముగా జరుగుతుంది.  నెయ్యి, శరీరమునందు ఉష్ణమును కలిగించి, బలమును వృద్ది పొందును.  తేనే శరీరమును కాంతివంతముగా చేసి కఫా దోషమును తగ్గించి నోటిలో చొంగ వృద్ది చేసి జీర్ణ వ్యవస్థను వృద్ది పరచును.  ఈ జాతకర్మ వలన తల్లి తండ్రుల శరీరములనుండి కలిగిన అనేక దోషములు తొలగిపోవును.  

             జాతకర్మ తండ్రియే చేయవలెను.  ప్రసవవార్త వినగానే తండ్రి తలస్నానము చేయవలెను.  చెడు నక్షత్ర జనన దోషము లేనిచో తండ్రి తన పెద్దలకు, దేవతలకు నమస్కరించి పుత్రుని లేక పుత్రిక ముఖము చూడవలెను.  స్నానము చేసి అలంకరించుకుని, బొద్దు కోయకముందే, చనుబ్రాలు తాగాకముందే ఇతరులు అంటుకొకముందే శిశువును కడిగి, తల్లి ఒడిలో ఉండునట్లు చేయవలెను.  శిశువునకు బొద్దుకోసిన వెంటనే తల్లిదండ్రులు మున్నగువారికి సూతకము అనగా పురుటి దోషము వచ్చును. 

             దౌహిత్రుడు (కూతురు కొడుకు) పుట్టిన తాత, అమ్మమ్మలు మూడు రోజుల పురుడు పట్టవలెను.  దౌహిత్రి (ఆడపిల్ల) అయిన అక్కరలేదు.  

               తండ్రియే జాతకర్మ సంస్కారము చేయవలెను.  అట్లు చేయుటవలన శిశువునకు పుట్టుకతోనే సంక్రమించిన బాలారిష్టాది దోషాలు నశిస్తాయి.  ఈ సంస్కార నిర్వహణ వలన శిశువునకు దీర్ఘాయిశ్యు, జన్మకాలములో సంక్రమించిన "అమంగళ యోగములు" తొలగిపోవును.  దుష్ట తిధి వార నక్షత్రములందు జననమైనచో శాంతి, ఆజ్య వీక్షణము, లేనిదే శిశువు ముఖము చూడరాదు.  ఆడపిల్ల అయిన 13 వ రోజు, మగపిల్లవాడైన  12 వ రోజు ఊయలలో పరున్దబెత్తవలెను.  దీనికి పంచాంగ శుద్ధి అవసరములేదు.  పంచాంగ శుద్ధి గల సమయమున నెలలోపల బాలెంత జలస్మీపమునకు వెళ్లి "గంగాపూజ" చేయవలెను.  మూడవ నెల యందు శిశువునకు సుర్యావలోకనము (బయటకు తెచ్చి సూర్యుడిని చూపించుట) చేయవలెను.  3, 4, 5 వ మాసమునండుగాని, లేక అన్నప్రాశన కాలమందైన శిశువును భూమిపై కూర్చుండ బెట్టవలెను  .  

                  శిశువు జన్మించిన వెంటనే నక్షత్రము మంచిదా? కాదా? అని చూడాలి.  ఇక నక్షత్ర జనన దోషము అనగా తల్లి, తండ్రి జన్మ నక్షత్రాలలో జన్మించుట, తనకన్నా ముందు జన్మించిన సోదరీ, సోదర జన్మ నక్షత్రాలలో జన్మించటం ఇక నక్షత్ర దోషం అంటారు.  తల్లి తండ్రి మేనమామ మొదలగు వారికి దోషం కల నక్షత్రాలలో జన్మించినప్పుడు ముఖావలోకనం చేస్తారు.  మట్టి మూకుడు లేదా ఏదైనా పాత్రలో నువ్వుల నూనెను పోసి ఒకవైపు శిశువును ఒడిలో వుంచుకొని మధ్యలో తెర (వస్త్రము) వుంచి రెండవవైపు నుండి శిశువు ప్రతిబింబము నూనెలో చూడటాన్ని ముఖావలోకనం అంటారు.  ఇలా చేయటం వలన దోష నివృత్తి కలుగుతుంది.  జన్మ సమయంలో పేగు మెడలో వేసుకొని జన్మిస్తే పినపపిండితో చేసిన చిట్టి గారెలు దారముతో దండలా తయారు చేసి శిశువుమెడలో వేసి మేనమామ ద్వార ఆ దండ తీయిస్తారు.  దాని వల్ల దోష నివృత్తి కలుగుతుంది.  

                బాలారిష్ట దోషాలలో ద్వితీయ, పంచామాలలోని రవి, అష్టమములోని చంద్రుడు, సప్తమములోని కుజుడు, చతుర్ధ, ద్వాదశిలలోని బుధుడు, త్రుతీయంలోని గురువు, షష్ఠ స్థితిలోని శుక్రుడు, లగ్నములోని శని, నవమంలోని రాహువు బాలారిష్ట దోషాలుగా చెప్పబడ్డాయి.  కనుక ఈ దోషాలు వున్నప్పుడు ఆయా గ్రహాలకు గ్రహశాంతి చేయించుకుంటే మంచిది.  బాలారిష్ట దోష నివారణ శాంతి 27  రోజులలోపు లేదా మూడు నెలల లోపు చేయవచ్చును.  ఎక్కువగా దోషాలుంటే శివునకు రుద్రాభిషేకము చేసే రోజునే మృత్యుంజయ జపం చేయిస్తే మంచిది.  బాలారిష్ట దోష ప్రభావము మొదటి మూడు రోజులు ఎక్కువగా వుంటుంది.  మొదటి మూడు నెలల తరువాత దోషం తగ్గుతుంది.  ఈ సమయములో ఆరోగ్య పరమైన సమస్యలు ఏర్పడే అవకాశము ఉంది.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

  • Astroconsultation
  • Questions
  • Online Pooja
  • JyothiShayam
  • whatsapp
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb